ఈ పథకంలో మీరు ప్రతి నెల కొంత డబ్బును పొదుపు చేయడం వల్ల భారీగా నిధులు పొందవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పటికీ డ్రెస్ కు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకోలేము అని ఆలోచించేవారు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా ద్వారా ఇన్వెస్ట్ చేసి ఏకంగా 16 లక్షల రూపాయల వరకు రిటర్న్స్ పొందవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం 5 సంవత్సరాల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అకౌంటు హోల్డర్ మరణిస్తే ఆ డబ్బులు నామినికి కూడా అందిస్తారు. అకౌంట్లో జమ చేసిన మొత్తంలో 50 శాతం విత్డ్రా కూడా చేసుకోవచ్చు . ఇప్పుడు మీకు 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తోంది..
16 లక్షల రూపాయలను పొందాలి అనుకుంటే ప్రతినెల 10,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాల పాటు చేసినట్లయితే చక్రవడ్డీ తో కలుపుకొని మొత్తం 16 లక్షల రూపాయలను మీరు సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా సేవింగ్స్ స్కీం కూడా అందుబాటులో ఉంది ఇందులో కూడా మీరు మంచి రిటర్న్స్ ఉండవచ్చు. వివరాల కోసం దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్ బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించవచ్చు.