ఇకపోతే దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల సమగ్ర డేటాబేస్ను రూపొందించడానికి ఈ శ్రమ్ పోర్టల్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ పోర్టల్ ను 2021 ఆగస్టు 26 వ తేదీన మీరు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలోని అసంఘటిత రంగ అందరికీ సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను అందించే చే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అసంఘటిత రంగంలోని కార్మికులకు అందరి నమోదు ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రకారం పూర్తవుతుందని చెబుతున్నారు.
ఇప్పటికే 94.11 శాతం మంది కార్మికులు కేవలం 10,000 కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారు అని, ఇక మొత్తం 27.69 కోట్ల మంది మాత్రమే అసంఘటిత రంగంలో కార్మికుల నమోదు చేసుకున్నారని సమాచారం. ఇకపోతే ఇప్పటికే చాలా మంది అత్యధిక పేదరికంలో జీవిస్తున్నారని వారిలో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన వారు కావడం గమనార్హం. వీరందరినీ ఆదుకోవడానికి ఈ పోర్టల్ లో నమోదు చేసుకుంటే రెండు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందట.