
ప్రస్తుతం దేశంలో ఉన్న అగ్రశ్రేణి బ్యాంకులలో రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. ఇకపోతే ఏ బ్యాంకు ఎలాంటి రేట్లను అందిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
సాధారణ పౌరులు అలాగే సీనియర్ సిటిజన్ల కోసం రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీ రేట్లను దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వడ్డీ రేటు 5.1 శాతం ఉండగా దానిని ఇప్పుడు 5.50 వరకు పెంచడం జరిగింది. ముఖ్యంగా మూడు సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు ఆర్ డీ పథకాలపై బ్యాంకు 5.45 శాతం వడ్డీని కూడా ఇవ్వడం జరుగుతోంది. 10 సంవత్సరాల వరకు ఆర్ డి లో ఖాథా పై డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 5.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది
హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రస్తుతం 3.5 శాతం ఉండగా దానిని ఇప్పుడు 5.10 శాతం వరకు అందిస్తోంది. 90 నెలలు, 120 నెలలు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.75 శాతం ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే పది సంవత్సరాల వరకు రికరింగ్ డిపాజిట్ ఖాతాలకు 5.75 శాతం వడ్డీ రేట్లను ఇవ్వడం జరుగుతుంది.
ఇక పోస్టాఫీసుల విషయానికి వస్తే .. జూన్ 2022 త్రైమాసికానికి గాను వడ్డీ రేటు 5.85 శాతం ఉంటుంది అయితే ఇందులో ఐదేళ్ళ వ్యవధిని నిర్ణయించారు.