డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అయిన ఫోన్ పే మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి యు పి ఐ సిప్ అనే ఆప్షన్ ని ప్రకటించడం జరిగింది. ఇక ఫోన్ పే యాప్ ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ బంగారం లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ప్రతి నెలా కూడా అంతే మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగే బంగారం లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కల్పించడం జరిగింది. అయితే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం వంద రూపాయల నుంచి పొదుపు ప్రారంభించవచ్చు. మీరు చెల్లించిన మొత్తానికి ఆ రోజు బంగారం ధర ప్రకారం ఎంత బంగారం అయితే వస్తుందో ఆ గోల్డ్ మీ వాలెట్ లోకి వస్తుంది. ఇక మీ పేరు మీద వచ్చే ఈ బంగారాన్ని బ్యాక్గ్రౌండ్ లాకర్ లో కూడా భద్రపరుచుకోవచ్చు. ఇక ఈ లాకర్లను ఎమ్ ఎన్ టి సి, పి ఎ ఎం పీ మీ, సేఫ్ గోల్డ్ సంస్థలు ఈ లాకర్లను నిర్వహిస్తాయి. ప్రతి నెల గుర్తు పెట్టుకొని మరీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించబడింది.
ఒకసారి మీరు ప్రాసెస్ సెట్ చేశారు అంటే చాలు ప్రతి నెల ఆటోమేటిక్గా మీరు సూచించిన మొత్తం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. బంగారం కొనడమే కాదు మీరు జమచేసిన మొత్తం బంగారాన్ని నిమిషాలలో అమ్మేయవచ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బంగారం కొనలేని వారికి ఇది ఒక పొదుపు పథకంలా ఉపయోగపడుతుంది.