సహాయం చేసే ముసుగులో ఏటీఎం కార్డులమార్పిడి చేసి మోసాలకు పాల్పడే ఓ ఘరానా మోసగాడిని ఇటీవల ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 100కు పైగా నేరాలకు పాల్పడ్డాట. అతడిని అరెస్టు చేసి14 కేసుల్లో నిందితుడిగా తేల్చారు. అతడి వద్ద నుండి రూ.2.30 లక్షల నగదు రికవరీ చేశారు. అలాగే 26 గ్రాముల రెండు బ్రాస్లెట్స్, కొన్ని ఎటిఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.


విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఏటీఎంకేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులకు సహాయపడుతున్నట్లుగా నటిస్తూ ఈ ఘరానా మోసగాడు మోసాలు చేస్తాడు.. వారి బ్యాంకు ఖాతాల నుండి నగదును కొల్లగొట్టేవాడు. ఈ నిందితుడు గుంటూరు పట్టణంకు చెందిన కూరంగి విద్యాసాగర్ గా పోలీసులు గుర్తించారు.  ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వారికి తనను బ్యాంకు మేనేజరుగా పరిచయం చేసుకొంటాడు.


ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటూ నగదును విత్ డ్రా చేసేందుకు వచ్చే గ్రామస్ధులు, వృద్ధులను టార్గెట్గా చేసుకుంటాడు. వారికి సహాయ పడుతున్నట్లుగా నటించి, వారి పిన్ నంబరు తెలుసుకుంటాడు. అలాగే వారు కోరినంత నగదు డ్రా చేసి వారికి ఇస్తాడు. అయతే.. ఆ సమయంలో హస్తలాఘవం ప్రదర్శిస్తాడు. వారి కార్డును తన వద్ద ఉంచుకొని, తనతో తెచ్చుకున్న ఇతర డమ్మీ కార్డులను వారికి ఇస్తాడు. ఆ తర్వాత వారి కార్డు నుంచి ఉన్న నగదంతా డ్రా చేసుకుంటాడు.


ఈ ఘరానా మాయగాడు.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ఉద్యోగిగా ప్రజలను నమ్మించేవాడట. వారికి తనపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 101 నేరాలకు పైగా పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా విజయనగరంలో జూన్ 25న మధ్యాహ్నం దాసన్నపేట ఏటీఎం కేంద్రం వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుంటే విజయనగరం 2వ పట్టణ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇదే తరహాలో పలు నేరాలకు పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: