
దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ స్కీమ్ కింద డెత్ క్లైమ్ చేసుకోవచ్చు. ఇక ఈ పథకం కింద ఖాతాదారుడు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందడానికి ఈ - నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఇక ఈ - నామినేషన్ చేయకుండా డబ్బు అనేది విత్ డ్రా చేసుకోలేరు . ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు తీసుకోవడానికి నామినీ ధృవ పత్రం కూడా చాలా అవసరం అవుతుంది. ఇక ఈ - నామినేషన్ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
ముందుగా..epfindia.gov.in అనే వెబ్సైట్ పై క్లిక్ చేయాలి. ఇక మీరు సేవ ఎంపికను ఎంచుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ యొక్క యు ఏ ఎన్ నెంబర్ ,పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. ఇక మేనేజ్ ఎంపిక పై క్లిక్ చేసి వివరాలు అందించి.. ఎంపికపై మరొకసారి క్లిక్ చేయాలి. ఇక ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి తర్వాత అన్ని వివరాలను అందించాలి. తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ నింపితే ఈ - నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక తర్వాత ఈ డి ఎం ఐ పథకాల యొక్క ప్రయోజనాలను ఖాతాదారుడు సులభంగా పొందవచ్చు.