ప్రతినెల మీరు ఎంత డబ్బు అయితే జమ చేస్తారో దాన్నిబట్టి మీ వృద్ధాప్యంలో మీకు పెన్షన్ లభిస్తుంది. ముఖ్యంగా చిన్న వయసు నుంచి రిటైర్మెంట్ ఫండ్ పై దృష్టి పెట్టాలనుకునేవారు ఎక్కువగా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరినట్లయితే మిగతా వయసుల వారి కంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇక వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 సంవత్సరాల వయసు ఉన్నవారు సుమారుగా వారికి 42 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ పథకంలో ప్రీమియం చెల్లించాలి. అలాగే 40 సంవత్సరాలు ఉన్నవారు వారికి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పథకంలో డబ్బులు చెల్లించాలి. ఇంకా ఎవరు ఎలా చెల్లించినా సరే 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకోవడం మొదలు పెట్టవచ్చు.
ఇక ఈ ఖాతా ను ఎలా మొదలుపెట్టాలి అంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ ఖాతా ఉండాలి . మీరు అక్కడ సిబ్బంది సహాయంతో అటల్ పెన్షన్ యోజన పథకానికి రిజిస్ట్రేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలను ఇచ్చి ఆ తర్వాత మీరు ఎంచుకున్న చెల్లింపులు పద్ధతిలో డబ్బు చెల్లించాలి. ఇక రూ. 125 నుంచి 248 రూపాయలు వరకు మీరు చెల్లించడం వల్ల 60 సంవత్సరాలు దాటిన తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.