
ఇక టెక్స్టైల్ పరిశ్రమతో అనుబంధం ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ అయినటువంటి శుభమ్ పాలిస్పిన్.. ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది. గత రెండు సంవత్సరాల క్రితం 1000% రాబడిని తీసుకొచ్చిన ఈ స్టాక్ మార్కెట్ 22 రూపాయల నుంచి 228 రూపాయలు అందివ్వడం గమనార్హం. 2022 జూలై 22వ తేదీన కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి అయినా రూ.228.50 కి చేరుకోవడం గమనార్హం. ఇక దీంతో శుభం పాలిస్పిన్ కూడా తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించడానికి సిద్ధమైంది. ఎంత షేర్లు ఇవ్వాలనే విషయంపై బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇకపోతే మే 2019లో అనగా రెండు సంవత్సరాల క్రితం బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో ఈ కంపెనీ షేర్ విలువ రూ.20.83 ఉండేది.. కానీ ఇప్పుడు ఏకంగా రూ. 220 దాటేసింది. జూలై 22వ తేదీన రూ.228.50 వద్ద ట్రేడ్ అయ్యి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందివ్వడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే మీరు కనుక గత రెండు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు కనుక పెట్టుబడి పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.10 లక్షలకు చేరుకునేది. ఒకవేళ రూ.10వేలు పెట్టిన సరే లక్ష రూపాయలు లభించేది. కాబట్టి ఇలాంటి మంచి రాబడిని అందించే స్టాక్ మార్కెట్లో మీరు డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు.