ఇకపోతే ఎల్ఐసి అందిస్తున్న జీవన్ శిరోమణి పాలసీలో మీరు డబ్బులను దాచుకోవడం వల్ల మీకు తక్కువ సమయంలోనే అధిక లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఎల్ఐసి వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఎల్ఐసి జీవన్ శిరోమణి పాలసీ అనేది ఒక నాన్ లింక్డ్ , పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ కావడం గమనార్హం. ఇది మినిమం మీకు కోటి రూపాయలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎక్కువ ఆదాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. ఉదాహరణకు పాలసీదారుడు 18 సంవత్సరాల వయసులో ఈ పాలసీని తీసుకోవడానికి కుదురుతుంది. ఇక గరిష్టంగా వయసు 55 సంవత్సరాలు ఉండాలి.
ఇకపోతే 18 సంవత్సరాల వయసు ఉన్నవారు 14 సంవత్సరాల పాటు పాలసీ టర్మ్ తీసుకోవాలి . ఇక 51 సంవత్సరాలు ఉన్నవారికి 16 సంవత్సరాలు, 48 సంవత్సరాల వయసు ఉన్నవారికి 18 ఏళ్ల పాలసీ టర్మ్, అలాగే 45 సంవత్సరాలు వయసున్న వారికి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ లభిస్తుంది. ఇక మీరు తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలి అంటే ప్రతి నెల పెట్టే పెట్టుబడి కూడా కొంచెం ఎక్కువ లో ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్ కింద మీరు లోన్ సదుపాయం కూడా పొందవచ్చు.