ఇటీవల కాలంలో చాలామంది పదవీ విరమణ తర్వాత డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఉద్యోగంలో ఉన్నప్పుడే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇకపోతే మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం ఒక అద్భుతమైన, ప్రయోజనకరమైన వార్తను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకం గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఇందులో మీరు అలాగే మీ భార్య ఇద్దరు వేరువేరు గా ఖాతా తెరవడం వల్ల ప్రతినెల 10 వేల రూపాయల వరకు పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది.

ఇక అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ పథకం ద్వారా మీరు పెట్టే పెట్టుబడి.. మీరు పొందే పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ పథకం మీద మీరు నెలవారి కనిష్టంగా వెయ్యి రూపాయలు నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ పొందుతారు. అయితే ఇది సురక్షితమైన పెట్టుబడి కావడం గమనార్హం. ఇకపోతే ప్రతి ఆరు నెలలకు కేవలం 1239 రూపాయలు పెట్టుబడిగా పెడితే పెట్టిన తర్వాత ప్రభుత్వం నెలకు మీకు 5000 రూపాయలను అంటే 60 సంవత్సరాల తర్వాత 60 వేల రూపాయలను పెన్షన్  హామీ ఇస్తుంది. భార్య భర్తలు ఇద్దరూ కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం మీరు 1.2 లక్షల రూపాయలను పెన్షన్ కింద పొందుతారు.



పెట్టుబడి కోసం మూడు రకాల ఆప్షన్లను ఎంచుకొనే అవకాశం కూడా ఉంటుంది. నెలవారి లేదా త్రైమాసిక లేదా అర్ధసంవత్సరానికి జమ చేయవచ్చు .ముఖ్యంగా అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు రూ.1.5 లక్షల వరకు పన్ను  మినహాయింపు కూడా పొందుతారు. 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. ఇక ప్రతి నెల మీరు 210 రూపాయలను మాత్రమే చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత ప్రతినెల 5000 రూపాయలను పెన్షన్ గా పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: