ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు విద్యా.. ఉద్యోగాలరీత్యా సొంత ప్రాంతాలను వదిలి ఇతర నగరాలకు వెళుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా బయట తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక మీరు అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ ను ప్రారంభిస్తే మంచి ఆదాయం ఉంటుంది. ఇక ఈ బిజినెస్ కు పెద్దగా ఖర్చులు ఉండవు.. మీ ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లోని కస్టమర్లకు డోర్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారు ముందుగా పబ్లిసిటీ చేసుకుంటే మరింత మంచిది.
ఇక మరొక వ్యాపారం విషయానికి వస్తే.. టీ షర్టులు, కప్పులపై చిత్రాలను ముద్రించి ఇతరులకు గిఫ్టులుగా అందించే సంస్కృతి గత పూర్వకాలం నుంచి వస్తున్నదే.. ఇక ఈ బిజినెస్ తో కూడా మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని అందించే బెస్ట్ బిజినెస్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రింటింగ్ మెషిన్, రంగులు ఖర్చవుతాయి.