
ఒకప్పుడు లాప్టాప్ అంటే కేవలం ఆఫీసులో మాత్రమే కనిపించేవి.. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి అవసరం గా మారడానికి కారణం టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇక లాప్టాప్ లు మొబైల్ ట్రెండు పెరిగిపోతున్న నేపద్యంలో వాటి రిపేర్ చేసే వారికి కూడా పూర్తిస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ముందుగా మీరు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేముందు లాప్టాప్ అలాగే మొబైల్ రిపేరింగ్ లో కోర్స్ చేయడం చాలా ముఖ్యం. దేశంలోనే అనేక ఇన్స్టిట్యూట్ లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇక కావాలంటే మీరు లాప్టాప్, మొబైల్ రిపేరింగ్ ను ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఏదైనా వినడం కంటే దగ్గరుండి చేయడం చాలా ఉత్తమం కాబట్టి సెంటర్ కి వెళ్లి నేర్చుకుంటే మీ పని మరింత సులభం అవుతుంది.
ఇక మీరు రెండు లక్షల రూపాయల ఖర్చు పెట్టి కంప్యూటర్ రిపేరింగ్ కేంద్రాన్ని పెట్టినట్లయితే చిన్న వస్తువులను రిపేర్ చేయడం మొదట మొదలు పెడితే ఆ తర్వాత మీ పని పెరిగే కొద్దీ పెట్టుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ల్యాప్టాప్ లు మొబైల్ లను విక్రయించడం అలాగే వాటిని రిపేర్ చేయడం రిపేరింగ్ ఫీజు ఇలా అన్ని కూడా మీకు మంచి లాభాన్ని అందిస్తాయి. ఇక ఒక రకంగా చూసుకుంటే ప్రారంభంలోనే ఈ వ్యాపారం నుండి మీకు రోజుకు 1000 రూపాయలు లాభం వస్తుందని చెప్పవచ్చు.