కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పండుగకు ముందే దేశంలోని 6 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేయనున్నట్లు సమాచారం అందించింది . ఇకపోతే త్వరలోనే పిఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగస్తుల ఖాతాలోకి బదిలీ చేయనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. అయితే డబ్బు బదిలీ తేదీ గురించి ఈపీఎఫ్ లో మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. వడ్డీ 8.1% చొప్పున అందుబాటులో ఉంటుంది అని , ప్రస్తుతం ఉద్యోగిని ఉద్యోగులకు 8.1% వడ్డీ ప్రయోజనాన్ని అందించబోతోంది.


గత 40 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు . ఇక ఇదే సమయంలో ఇంతకుముందు ప్రభుత్వం ఉద్యోగులకు 8.5% చొప్పున వడ్డీ ప్రయోజనాన్ని అందించేది. ఇక పిఎఫ్ ఖాతాలో 10 లక్షల రూపాయలు ఉంటే వడ్డీగా మీకు రూ.81, 000 లభిస్తాయి. అలాగే మీ ఖాతాలో ఒకవేళ రూ.7లక్షలు అంటే 56,700 రూపాయలను వడ్డీ కింద పొందవచ్చు. ఒకవేళ మీ పిఎఫ్ ఖాతాలో 5 లక్షల రూపాయలు ఉంటే రూ.40,500,  లక్ష రూపాయలు ఉంటే రూ.8,100 వడ్డీ కింద లభిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మన ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. ఎంత వడ్డీ జమ అవబోతోంది అనే విషయాలను తెలుసుకోవాలి అంటే ఇంటి నుంచే మీరు తెలుసుకోవచ్చు.  కేవలం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాలెన్స్ తెలిసిపోతుంది అయితే పిఎఫ్ డబ్బులు తనిఖీ చేయడానికి మీరు పిఎఫ్ ఖాతాకి అందించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి..011 - 22901406 అని నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇక దీని ద్వారా ఈపిఎఫ్ఓ సందేశం ద్వారా పిఎఫ్ వివరాలను పొందుతారు అంతేకాదు ఇక్కడ మీరు యూఏఎన్, పాన్,  ఆధార్ నంబర్లను లింక్ చేయడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: