ఇక ఈ పథకం 40 సంవత్సరాలు వయసు నుండి పెన్షన్ పొందడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒక రకమైన సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇందులో మీరు ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లిస్తే ఇక జీవితాంతం పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ డబ్బులను నామినీకి సింగిల్ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తారు. ఇక ఇదొక తక్షణ యాన్యుటీ ప్లాన్ అని చెప్పవచ్చు . ఇందులో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందడం ప్రారంభం అవుతుంది. ఇక ఈ పాలసీ తీసుకున్న తర్వాత పింఛన్ ప్రారంభమైతే జీవితాంతం ఒకే పెన్షన్ మీకు లభిస్తుంది.
ముఖ్యంగా భార్యాభర్తలకు బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు . ఎందుకంటే ఇందులో భార్య లేదా భర్త ప్రీమియం తీసుకున్న తర్వాత వారు చనిపోతే వారి భాగస్వామికి జీవితాంతం అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇక ఈ పథకం ప్రయోజనం కోసం కనీస వయోపరిమితి 40 సంవత్సరాలు గరిష్టంగా 80 సంవత్సరాలు ఉండాలి . ఇక ఇది జీవిత మొత్తం పెన్షన్ అందించే పాలసీ. ఇందులో మీరు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున పెన్షన్ పొందవచ్చు. ఇక సంవత్సరానికి 12 వేల రూపాయలను ఒకేసారి తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక పూర్తి వివరాల కోసం మీరు ఎల్ఐసి కార్యాలయాన్ని లేదా మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ ను సంప్రదిస్తే సరిపోతుంది.