ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదాయం తక్కువగా ఉన్నందున సామాన్యులు సరిగా భోజనం కూడా చేయలేకపోతున్నారు. ఇక అంతే కాదు నిత్యవసర సలకుల విషయంలో ఇలా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ 11 రకాల నిత్యవసర వస్తువులపై ధరలు తగ్గిస్తూ సామాన్యుడికి ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 2022 సెప్టెంబర్ 2న లీటర్ రూ.132 గా పామ్ ఆయిల్ ధర అక్టోబర్ 2న గరిష్టంగా 11 శాతం తగ్గి రూ. 118 రూపాయలకు చేరింది.


ఇక వనస్పతి నెయ్యి కిలో రూ.152 ఉండగా 6 శాతం తగ్గి రూ.143 కి చేరుకుంది. ఇక అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ రూ.176 నుంచి 6% తగ్గింపుతో రూ.165 కు చేరుకోగా.. సోయాబీన్ ఆయిల్ లీటర్ కి  రూ.156 నుంచి 5 శాతం తగ్గింపుతో రూ. 148 కి చేరుకుంది. ఆవనూనె 187 రూపాయలకి వేరుశనగ నూనె 185 రూపాయలకు చేరుకున్నాయి. కూరగాయల విషయానికి వస్తే ఉల్లి ధర కిలో 26 రూపాయలు ఉండగా 8 శాతం తగ్గి రూ. 24 కి చేరుకుంది. బంగాళదుంప ధర 7 శాతం తగ్గి రూ.28  నుంచీ రూ.26 కి చేరింది. ఇక పప్పు దినుసులు కిలో ధర రూ. 74 నుంచి రూ.71 కి, మసూర్ దాల్ కిలో  రూ.97 నుంచీ మూడు శాతం తగ్గి రూ. 71 కి,  మినప్పప్పు  కిలో రూ.108 నుంచీ రూ.106 కి చేరుకుంది.


ప్రస్తుతం గ్లోబల్ ధరల పతనంతో దేశీయంగా కూడా ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని ఇటీవల ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దిగుమతి సుంకాలు తగ్గడంతో భారత దేశంలో వంట నూనెల రిటైల్ ధరలు కూడా గననీయంగా పడిపోయాయని ప్రస్తుతం ఈ ధరల తగ్గింపుతో  సామాన్యుడికి కాస్త ఊరట కలిగిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: