
పెట్ కేర్ సెంటర్:
చాలామంది పెంపుడు జంతువులు ఇష్టపడుతూ ఉంటారు. మీకు కూడా పెంపుడు జంతువులు ఇష్టమైతే ఒక పెట్ కేర్ సెంటర్ ను మొదలు పెట్టవచ్చు. పెట్ కేర్ సెంటర్ మొదలు పెట్టడానికి ఎక్కువగా డబ్బులు అవసరం లేదు.
టిఫిన్ సెంటర్:
ఉదయాన్నే ఉద్యోగులకు టిఫిన్ పార్సెల్ చేసి ఇవ్వచ్చు. లేదంటే మీ ఇంటి దగ్గర చిన్న షాప్ నైనా సరే తయారు చేసుకోవచ్చు. మొదట కొంత పెట్టుబడితో ఈ టిఫిన్ సెంటర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.
బ్యూటీ పార్లర్:
దీనికోసం మీరు ఏదైనా కోర్స్ చేసి వెంటనే బ్యూటీ పార్లర్ ఇంట్లోనే మొదలు పెట్టవచ్చు. మొదట తక్కువ డబ్బులతో వ్యాపారాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత మీ వ్యాపారాన్ని పెద్దగా మార్చుకుంటే సరిపోతుంది.
ట్యూషన్ చెప్పడం:
మీకు గనక ఏదైనా ఒక సబ్జెక్టులో మంచి పట్టు ఉంటే పాఠశాల విద్యార్థులకు , కళాశాల విద్యార్థులకు ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికోసం పెట్టుబడి అసలే అవసరం లేదు.
ఇలా పెట్టుబడి లేకుండా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వీటివల్ల రిస్క్ ఉండదు. పైగా మీకు మీరే బాస్.. మీకు నచ్చిన విధంగా మీ తెలివితేటలతో సంపాదించడానికి వీలవుతుంది.