ఐఓసీఎల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ.115 తగ్గింది. అదే కోల్కతాలో రూ. 113 గా ఉంది. ముంబైలో రూ.115.5 తగ్గింది. ఇక చెన్నైలో సిలిండర్ ధర తగ్గింపు రూ. 116.5 గా ఉంది. అక్టోబర్ 1న కూడా ఈ గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయల మేర పడిపోయింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే సాగుతోంది. డొమెస్టిక్ సిలిండర్ రేటు స్థిరంగా ఉండగా కమర్షియల్ సిలిండర్ రేట్లు తగ్గిపోయాయి. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1744 కు తగ్గింది. ఇదివరకు సిలిండర్ ధర రూ. 1859 ఉండేది. అలాగే కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1846 తగ్గింది ఇప్పటివరకు ఈ రేటు రూ.1995 గా ఉండేది.
ఇక 14.2 కేజీల సిలిండర్ రేటు విషయానికి వస్తే కోల్కతాలో రూ.1079 ఉండగా, ఢిల్లీలో రూ.1053గా కొనసాగుతోంది . ముంబైలో రూ.1052, చెన్నైలో రూ.1068 , మరి తెలుగు రాష్ట్రాలలోరూ. 1111 కొనసాగుతోంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గి చిన్నపాటి హోటల్స్ పెట్టుకున్న సామాన్యులకు ఊరట కలిగిందని చెప్పవచ్చు.