ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ పథకం భారత దేశంలోనే అతిపెద్ద పథకమని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఎల్ఐసి పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ పాలసీలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది.. ప్రతి నెల లేదా త్రైమాసికం, అర్థ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికను కూడా పెన్షన్ పొందవచ్చు. మీకు 75 సంవత్సరాలు నిండితే ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు ఒకేసారి రూ.6,10,800 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.. దీనిపై ఖాతాదారుడి హామీ మొత్తం ఆరు లక్షలు .. ఈ విధంగా వార్షిక పెన్షన్ రూ.76, 650 లభిస్తుంది ఈ పెన్షన్ పెట్టుబడిదారికి జీవితాంతం అంటే మరణించే వరకు అందుబాటులో ఉండడం గమనార్హం.
ఒకవేళ మీరు ప్రతి నెల 20 వేల రూపాయలను పెన్షన్ గా తీసుకోవాలంటే ఇందులో ఒకేసారి రూ.40,72,000 పెట్టుబడి పెడితే ఈ మొత్తం మీరు పొందవచ్చు. ఇంత మొత్తం పెట్టుబడిగా పెట్టలేమనుకునేవారు.. రూ.6,10,000 పెట్టుబడిగా పెడితే ప్రతి నెల రూ.6,008 ను పెన్షన్ కింద పొందవచ్చు. ఎటు చూసినా సరే ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో మంచి లాభం లభిస్తుందని చెప్పాలి.