ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే మీరు ఉద్యోగం మానాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చెప్పబోయే ఈ బిజినెస్ ఐడియా మీరు ఖాళీ సమయంలో చేసుకుంటూ మరింత డబ్బు సంపాదించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులు పూర్తిచేసుకుని సాయంత్రం మీరు ఖాళీగా ఉన్న సమయాన్ని ఇలా ఈ ఉద్యోగం చేస్తూ సంపాదించవచ్చు. అయితే దీనికోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రూ.10వేల పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోతుంది. మీరు ఉద్యోగం వదలకుండా మీ ఖాళీ సమయంలో తక్కువ పెట్టుబడితో చేయగలిగే ఈ వ్యాపారం గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


చాక్ పీస్ లు తయారు చేయడం.. ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం అని చెప్పవచ్చు. దీనిని చేయడానికి పెద్దగా మూలధనం అవసరం లేదు.  ఇది ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేస్తారు. ఇది తెల్లటి పొడి జిప్సం అనే రాతితో తయారు చేయబడిన ఒక రకమైన మట్టి అని చెప్పవచ్చు. పాఠశాల,  కళాశాలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. టైలర్లు,  ఫర్నిచర్ తయారుదారులు , నిర్మాణ కార్మికులు అనేక ఇతర పరిశ్రమల వారు చాక్పీస్ నే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్లో ఉంటూనే వీటిని తయారు చేయవచ్చు.


కోచింగ్ ఇన్స్టిట్యూట్ లు:
ఈ రోజుల్లో ట్యూషన్ , కోచింగ్ ఇన్స్టిట్యూట్ లకు ట్రెండ్ బాగా పెరిగింది.  మీరు చదువుకొని తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించవచ్చు . ఎప్పుడు డిమాండ్ ఉండే వ్యాపారాలలో ఇది కూడా ఒకటి.


బ్యాగ్,  పర్సు తయారీ వ్యాపారం:
మీరు తక్కువ మూలధనంతో దీనిని ప్రారంభించవచ్చు.  ఇప్పటికే మీ దగ్గర కుట్టు యంత్రం వుంటే మీరు వివిధ రకాల బ్యాగులు,  పర్సులు తయారుచేసి విక్రయించవచ్చు . చేతితో తయారుచేసిన పర్సులకు ఇప్పుడు మరింత డిమాండ్ ఉంది.

చిరిగిన బట్టలకు మరమ్మత్తులు:
ఇటీవల కాలంలో బట్టలు కుట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది కానీ చిరిగిన బట్టలను కుట్టడం లేదా ఫిట్టింగ్లతో సహా చిన్న చిన్న మరమ్మత్తులకు టైలర్ లు అందుబాటులో లేరు. ఖాళీ సమయంలో మీరు ఇలా చిరిగిన వాటిని లేదా టైట్ ఫిట్టింగ్ వంటివి చేస్తూ డబ్బు సంపాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: