ఇందులో పొదుపు చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మంచి రాబడి కూడా లభిస్తుంది. ఈ పథకం ఈఈఈ క్యాటగిరి కిందకి వస్తుంది. మెచ్యూరిటీ విలువ వ్యవధి తర్వాత అందుకున్న మొత్తం పై పన్ను కూడా మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఎక్కడైనా సరే తెరవచ్చు. ఇందులో ఏడాదిలో కనీసం రూ. 500 కనిష్టంగా, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ పథకం పై 7.1% వడ్డీ అందిస్తోంది. ఇది ఏదైనా బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తం కంటే చాలా ఎక్కువ అని చెప్పాలి.
ముఖ్యంగా ఎక్కువ రేటు తో వడ్డీని చెల్లిస్తుంది మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే ఇందులో మీకు ఎక్కువ డబ్బు తిరిగి వస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల 5000 రూపాయలను పెట్టుబడిగా పెడితే ఏడాదికి రూ.60 వేల చొప్పున పిపిఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం 15 సంవత్సరాల తర్వాత మీ రూ.9 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడి పై 7.1 శాతం వడ్డీతో రూ.7.27 లక్షలు పొందుతారు అలా 15 సంవత్సరాల తర్వాత మీ చేతికి మొత్తం రూ. 16 లక్షలు వస్తుంది.