రబీ కాలంలో సాగు ఊపందుకున్న సమయంలో కొన్ని రకాల ఎరువుల ధరలు తగ్గడం రైతులకు ఊరట ఇస్తుందని చెప్పవచ్చు. కరీఫ్ లో అధికంగా ఉండగా రబీ లో ఎరువుల వాడకం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా 28-28-9, 14-35-14, 24-24-0 వంటి రకాల ఎరువుల ధరలను ప్రస్తుతం తగ్గిస్తూ కంపెనీలు డీలర్లకు సమాచారం అందించాయి . ముఖ్యంగా తగ్గించిన ధరల ప్రకారం చూసుకొని ఎరువులను సరఫరా చేస్తూ ఉండడం గమనార్హం.. గత మార్చిలో.. 28-28-9, 14-35-14 రకం ఎరువుల ధరలు బస్తా రూ.1900 ఉండగా ప్రస్తుతం మే నెలకి రూ.1700 కి తగ్గింది బాసర ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో డిఎపి వైపు ఖరీఫ్లో రైతులు మొగ్గు చూపారు.

ఇకపోతే అమ్మకాలు తగ్గడమో లేక ఇతర కారణాల వల్ల తెలియదు కానీ ప్రస్తుతం బస్తాకు రూ.200 తగ్గిస్తూ కోరమాండల్ కంపెనీ ధరలు నిర్ణయించింది. ధరల ప్రకారం రైతులు ఎరువులను కొనుగోలు చేయవచ్చు.  మూడు రకాల ఎరువుల బస్తా గరిష్ట ధర రూ.1500 నిర్ణయించింది . భాస్వరం ఎరువులు ధరలు తగ్గడం వల్ల డీఏపీకి గిరాకీ తగ్గే అవకాశం కూడా ఉంది.  ప్రస్తుతం పైరుకు పొటాష్ కూడా అవసరం ఉంటుంది. ముఖ్యంగా 14 - 35 - 14 రకం ఎరువులో పొటాష్ ఉంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.. ఇక వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో 20-20 రకం ధర బస్తా రూ. 1350 ఉండడంతో దీని వినియోగం తగ్గే పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం 10 - 26 - 26 , 12-  32- 16 రకం ఎరువుల ధరలు బస్తా రూ.1470 ఉండగా.. 15-15- 15 రకం బస్తా రూ. 1450 ఉన్న నేపథ్యంలో వీటిని ఉపయోగించేందుకు రైతులు వెనకాడే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి ధరలు తగ్గించడానికి ఆయా కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.


ఇకపోతే వ్యవసాయ రంగా నిపుణులు అంచనాల ప్రకారం ఎరువుల ధరలు అధికమవుతున్న నేపథ్యంలో రైతుల కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కనీసం ఇకనైనా ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే రైతులకు కొంతవరకు ఎరువులపై భారం తగ్గుతుంది అనడంలో సందేహం లేదు ఏది ఏమైనా ఒకరకంగా అ రైతులకు ఊరట కలిగించినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: