కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెట్టుబడి పథకంగా నేషనల్ పెన్షన్ సిస్టం స్కీంకు మంచి పేరుంది. ఇందులో డబ్బులు దాచుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా మీ డబ్బులు డెట్, ఈక్విటీలోకి వెళ్తాయి. అలాగే 75% డబ్బులను ఈక్విటీలోకి మిగతా 25% డబ్బులను డెట్ లోకి మళ్ళించవచ్చు. ముఖ్యంగా ఖాతాదారులు తమ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి 40:60 నిష్పత్తి లేదా 50:50 నిష్పత్తి కూడా ఎంచుకోవచ్చు. ఈ పథకంలో నెలకు రూ. 15, 000 చొప్పున 30 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే 60 సంవత్సరాల వయసు తరువాత రోజు నుంచి మీకు రెండు లక్షలకు పైగా పెన్షన్ లభిస్తుంది.
అది ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు ఉందనుకుంటే.. నెలకు రూ.15000 చొప్పున 30 సంవత్సరాల పాటు నేషనల్ పెన్షన్ సిస్టం స్కీమ్ లో పొదుపు చేస్తే డెట్ 40% , ఈక్విటీ 60% నిష్పత్తి ఎంచుకుంటే 30 సంవత్సరాల తర్వాత రూ.68,380 పెన్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మీ చేతికి రూ.2.05కోట్లు లభిస్తాయి. వార్షిక వడ్డీ 8 శాతం చొప్పున లెక్కిస్తే నెలకు రూ.1.55 లక్షలు మీ చేతికి వస్తాయి.