ముఖ్యంగా ఈ బాటిల్ యొక్క విశేషం ఏమిటంటే ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా దీని ఉత్పత్తిని ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వెదురు సీసాల సామర్థ్యం 750 ml నుంచి ఒక లీటర్ వరకు ఉండేలా మీరు తయారు చేయవచ్చు . దీని ప్రారంభ ధర రూ.300 నుంచి ప్రారంభం అవుతుంది.అయితే ఇంత ఖరీదైన బాటిల్ సామాన్యుడు ఎలా కొనుగోలు చేస్తాడు అనే అనుమానం మీలో కలగక మానదు.. అయితే ఆరోగ్యం కోసం సామాన్యుడైన సరే ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి మీరు ఈ బాటిల్ తో అత్యధిక లాభాన్ని సొంతం చేసుకోవచ్చు.
కానీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం.. వెదురు సీసాల తయారీలో శిక్షణ తీసుకోవడానికి నేషనల్ వెదురు మిషన్ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని పొందవచ్చు అని, ఈ వెబ్సైటులో వెదురు బాటిల్ ఎలా తయారు చేయాలో సమాచారం పొందుపరిచారు అని , ఇక్కడ అనేక ఇతర వస్తువులను తయారు చేయడానికి కూడా సమాచారం దొరుకుతుందని స్పష్టం చేసింది. వెదురు సీసాలు లేదా ఇతర వస్తువులను తయారు చేయడానికి ఒక యూనిట్ ప్రారంభించడానికి రూ.15 లక్షల ఖర్చు అవుతుంది మీరు ప్రభుత్వ సహాయంతో లోన్ పొంది.. మరీ ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు . ఎక్కువ లాభం అందించే బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.