
దోసకాయల వ్యాపారం. నీరు పుష్కలంగా ఉన్న ఇసుక, లోమీ నేలలో బాగా పండుతుంది. పీహెచ్ విలువ 6 - 7 మధ్య ఉంటే సరిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలో సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువుల పక్కన ఉండే భూముల్లో కూడా దీనిని పండించవచ్చు. అయితే ఈ పంటను గ్రామాలతో పాటు నగరాల్లో కూడా సాగు చేయవచ్చు. దోస పంట సాగుకు ప్రభుత్వాలు సైతం సహాయాన్ని అందిస్తున్నాయి. అందుకే మీరు మీ సమీపంలో ఉన్న వ్యవసాయ కేంద్రానికి వెళ్తే ఈ పంటకు సంబంధించిన పూర్తి వివరాలను సబ్సిడీ గురించి వెల్లడిస్తారు . దోసకాయ పంట కేవలం 60 నుంచి 80 రోజుల్లోనే చేతికి వస్తుంది. ఆ తర్వాత దోసకాయలను కోసి మీరు మార్కెట్లో విక్రయించవచ్చు.
ఇది తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇచ్చే పంట సగటున ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేస్తే సుమారుగా 70 క్వింటాళ్ల దోసకాయ పంట చేతికి వస్తుంది. మండీలలో క్వింటా ధర 2000 రూపాయల వరకు పలుకుతుంది. కానీ మీరు 1500 రూపాయలకు అమ్మినా సరే ఎకరానికి రూ.50,000 నికర లాభం లభిస్తుంది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్స్ తో మాట్లాడి ఒప్పందం చేసుకుంటే మీరు మరింత ఆదాయాన్ని పొందవచ్చు.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అంటే ఇలాంటి పంటను ఎంచుకుంటే రైతులు సరిపోతుంది. అయితే వీటి గురించి పూర్తిగా తెలుసుకొని పంటను వేయాలి.