ఈ మధ్యకాలంలో ఎక్కువమంది పలు వ్యాపారాల పైన దృష్టి పెడుతున్నారు. అనేక పంటలు పండిస్తూ కూడా పలు వ్యాపారం పైన దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఔషధ మొక్కల సాగు చేయడం వంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నారా.. అలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితే ఎక్కువ డబ్బులను సంపాదించే ఒక బిజినెస్ ఐడియా ఉన్నది.వాటి గురించి తెలుసుకుందాం.

ఈ బిజినెస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం కూడా వస్తుందని తెలుస్తోంది. అయితే ఖర్చు కూడా రూ.80 వేల వరకు అవుతుంది. ఆ బిజినెస్ ఏమిటంటే ఔషధ మొక్కల సాగు పైన ఎవరికైనా అవగాహన ఉంటే కచ్చితంగా వీటివల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఔషధ మొక్కలలో సర్పగంధ చాలా ప్రాధాన్యతని కలిగి ఉంది. ఈ మొక్కల ద్వారా సాగు చేసి ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ మొక్కలు ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో  ఉపయోగిస్తూ ఉంటారట. ఈ పంటని మనం ఒక్కసారి మొదలుపెట్టామంటే ఏడాదిలో పంట చేతికి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.


ఈ మొక్కలకు పూలు, పండ్లు, కాయలు , వేర్లు కూడా అన్ని మందులకు బాగా ఉపయోగిస్తూ ఉంటారట కాబట్టి . ఈ పంటకి కాపలా ఉండాల్సిన పని కూడా ఉండదు కేవలం ఈ పంట పండించడానికి భూమి కాస్త జిగురుగా ఉండే నెల అయితే నిపుణులు తెలియజేస్తున్నారు. నల్ల మట్టి నేలలు కూడా ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి ఎలాంటి వాతావరణంలో నైనా సరే ఈ పంట బాగా పండుతుందట. సేంద్రియ పదార్థాలని నైట్రోజన్ మట్టిలో కలపాలి అలానే మట్టిలో రాళ్లు లేకుండా చూసుకోవాలి ఈ పంట జూన్ , ఆగస్టు మధ్య సాగు చేసినట్లు అయితే మంచి ఫలితం లభిస్తుంది. ఎకరానికి 30 కేజీల విత్తనాలు అవసరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: