జీవిత బీమా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఆరోగ్యంగా, ఆర్థికంగా జీవించడానికి జీవిత బీమా కూడా చాలా అవసరం. చాలామంది జీవిత బీమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆధారపడిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే జీవిత బీమా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతీయులకు విడదీయరాని అనుభవం ఉంది. ఎల్ఐసి అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న సంస్థ.. దాని పాలసీలలో పెట్టుబడి పెడితే డబ్బు సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా ఎల్ఐసి ఆయా వయో వర్గాలకు ప్రయోజనకరంగా ఉండే పాలసీలను మాత్రమే రూపొందిస్తుంది. ఎల్ఐసి అందిస్తున్న బెస్ట్ రిటర్న్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఎల్ఐసి జీవన్ అక్షయ్ యువజన పథకం కూడా పాలసీదారులకు సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది
 ఈ ప్లాన్ రిటైర్మెంట్ తర్వాత మీకు ఆర్థిక భద్రత అందిస్తుంది. ఈ పాలసీ జీవితాంతం ఇస్తుందని చెప్పవచ్చు. లేకపోతే ఇందులో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.  పదవి విరమణ తర్వాత ప్రతినెల పెన్షన్ పొందవచ్చు. 35 నుండి 85 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ప్రత్యేకంగా ఆలోచించే వ్యక్తులు కూడా ఈ పాలసీ నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.  ముఖ్యంగా ఎల్ఐసి జీవన్ అక్షయ యోజన పథకంలో పది ఎంపికలు ఉన్నాయి. మీ వయస్సు ఆధారంగా పెన్షన్ కూడా మారుతుంది.


ఈ పథకంలో నిర్దిష్ట గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.  పాలసీదారులు ఈ పథకం కింద రుణాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా ఈ పాలసీలో చేసే పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే పెన్షన్ మొత్తం మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది. పిల్లల చదువులు, పెళ్లి , ఖర్చులకోసం కూడా దీనిని రూపొందించారు.  ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కలిగిస్తుంది. ఈ పథకంలో చేరడం వల్ల ఆర్థిక భరోసా పాటు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: