ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి పన్ను ఆదా ఉండే పథకాలలో ప్రతి నెల నిర్ణీత మొత్తం మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన పని. కానీ చాలామంది దీనిని అనుసరించలేదు. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో పన్ను ఆదా సాధనాలలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. నిజానికి పన్ను ఆదాకి తోడు మెరుగైన రాబడులు ఇచ్చే పథకాల్లోనే ఇన్వెస్ట్ చేసినప్పుడు అసలైన ప్రయోజనం పొందవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈక్విడ్ లింక్డ్ సేవింగ్స్ స్కీం మెరుగైన సాధనం అవుతుంది.


ఒకవైపు సెక్షన్ 80 సి కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు లభించడమే కాకుండా మరొకవైపు మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగిస్తే దీర్ఘకాలంలో ఇతర అన్ని పథకాల కంటే మెరుగైన రాబడి ఈ పథకం ద్వారా పొందవచ్చు. ఈ ఎల్ ఎస్ ఎస్ విభాగంలో కెనరా రోబేకో టాక్స్ సేవర్ ఫండ్ ను ఇన్వెస్టర్లు తప్పకుండా పరిగణలోకి తీసుకోవచ్చు. పెట్టుబడులను ఐదేళ్లపాటు కొనసాగించి ఉంటే 10%.. ఏడేళ్ల పాటు కొనసాగిస్తే 14%.. పదేళ్లపాటు ఉంచినప్పుడు 14% రాబడులను ఈ పథకం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.


 ముఖ్యంగా రెగ్యులర్ ప్లాన్ లో.. డైరెక్ట్ ప్లాన్ లో అయితే 15% పైనే రాబడులు లభిస్తాయి.  ముఖ్యంగా మద్యస్థ రిస్కు తీసుకునే వారికి ఈ పథకాలు కొంచెం అనుకూలమైనవి. పన్ను ఆదా అవసరం లేని వారు లాకింగ్ ఉన్న పథకాలు కోరుకునే వారికి కూడా ఇవి అనుకూలమే.  ఇలాంటి ఎన్నో పథకాలు ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్నాయి.  అయితే మీరు ఎక్కడైతే డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారో అప్పుడు పన్ను మినహాతో పాటు అధిక రాబడి ఇచ్చే పథకాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. పైగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  భవిష్యత్తు కోసం ఆలోచించేవారు ఇలా ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఆదా చేయడం మొదలుపెడితే మరిన్ని లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: