ఇకపోతే పీఎం కుసుమ్ యోజన పథకం నుండి ఎలా సంపాదించాలి? సోలార్ పంపు సిస్టంలను ఎలా ఏర్పాటు చేయాలి? అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సోలార్ పంపు సిస్టంలను పొలాలలో ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలకు ఉచితంగా నీరు అందించవచ్చు. సోలార్ సిస్టం అమర్చడం వల్ల విద్యుత్ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు. నీటిపారుదల పంపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ముఖ్యంగా కరెంటు కోత వల్ల రైతుల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపు సిస్టం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఇకపోతే మీరు మీ వినియోగానికి అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీరు దానిని విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ కు విక్రయించడం వల్ల కూడా డబ్బు సంపాదించవచ్చు. రెండు రకాలుగా మీకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది మీకు ఖాళీగా ఉన్న భూమి ఉంటే మీరు దానిని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చి తద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులో మీరు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటినుంచి డబ్బు పొందవచ్చు.