ప్రస్తుతం భారత ప్రభుత్వం దేశంలోనే ప్రతి విభాగానికి అనేకరకాల పథకాలను అమలు చేస్తుంది. అందుకే వీటిలో చాలా చిన్న పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో రాబడిన అందుకోవచ్చు అని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2022 - 23 ఆర్థిక సంవత్సరం ఎలాగో ముగిసింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రణాళిక చేయకపోతే కచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ముందుగా మీరు ఎక్కువ రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందే పథకం కోసం చూస్తున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కచ్చితంగా మీకు డబుల్ రాబడి అందిస్తుంది.

ఇందులో మీకు 100% భద్రత హామీ లభిస్తుంది. కాబట్టి ఈ పథకం కింద మీరు పోస్ట్ ఆఫీస్ తో సహా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులలో ఖాతా ను  తెరవచ్చు. భారతీయ పౌరుడు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వారు పోస్ట్ ఆఫీస్ పీ పీ ఎఫ్ పథకంలో పెట్టుబడిపెట్టి అదే సమయంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతా ను 15 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరానికి కూడా రూ.500 నుంచీ రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఇందులో 7.1% వడ్డీ రేట్ ను పొందుతారు కాబట్టి మీకు మంచి లాభం వస్తుంది. అంతే కాదు ఇందులో పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా మీరు పొందుతారు. సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు దాదాపు రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. దీంతోపాటు ఈ పథకం పై వచ్చే వడ్డీ పై కూడా మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నిరభ్యంతరాయంగా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: