
సీనియర్ సిటిజెన్లు ఎక్కువగా మంత్లీ ఇన్కమ్ పథకాన్ని ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఎటువంటి రిస్క్ లేకుండా చేతికి డబ్బు ప్రతినెలా రావాలి అనుకుంటే ఈ పథకాలు సురక్షితమైనవి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పథకం లో చేరితే 7.1% వడ్డీ కూడా లభిస్తుంది. అంతే కాదు ప్రతి నెల ఈ డబ్బులు మీకు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ప్రతినెలా మీరు ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి లేకపోతే వడ్డీ పడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 10 సంవత్సరాలకు పైగా వయసున్న వారు ఎవరైనా సరే ఈ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. లక్ష రూపాయలు పెట్టినట్లయితే ప్రతినెల 592 రూపాయలు మీ చేతికి వస్తాయి.
ఒకవేళ రూ.2 లక్షలు పెట్టుబడిగా పెడితే 1183 రూపాయలు ప్రతినెల పొందవచ్చు. ఒకవేళ రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 2958 మీ చేతికి వస్తుంది.. ఒకవేళ మీరు ఈ పథకంలో రూ.15 లక్షల పెట్టినట్లయితే ప్రతినెల 8,875 రూపాయలను పొందుతారు.