ఈ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మోడీ సర్కారు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కొత్త స్కీం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి.. అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.. ముఖ్యంగా మహిళలు సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో చేరాలని అనుకుంటే రూ. 2 లక్షల వరకు డబ్బులను దాచుకునే వీలు ఉంటుంది. ఈ స్కీం టేన్యూర్ రెండు సంవత్సరాలు మాత్రమే. ఈ పథకంపై 7.5% కూడా వడ్డీ లభిస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. అంతేకాదు ఈ పథకంలో చేరిన మహిళలు పాక్షిక విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా పొందవచ్చట.
ఇకపోతే త్వరలోనే ఈ పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పథకం పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంకుల్లో కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని సమాచారం. ఇతర స్మాల్ సేవింగ్స్ పథకం మాదిరిగా ఇందులో కూడా ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుందని చెప్పవచ్చు.. ఉదాహరణకు మహిళా సమాన్ సేవింగ్స్ పథకంలో రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.16,022 లభిస్తాయి. రెండేళ్లకు గాను రూ.32,044 లభిస్తాయి.. రెండు లక్షల ఇన్వెస్ట్మెంట్ పై మీరు 32 వేలకు పైగా లాభం పొందవచ్చు.