అదే టమాటో కెచప్.. సాస్ తయారీ వ్యాపారాన్ని మీరు ఇంటి నుంచి ప్రారంభించి అంతకుమించి లాభాలను పొందవచ్చు . పిల్లలు , పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా అన్నింటి స్నాక్స్ లోకి ఈ టమాటో కెచప్ ని కాల్స్ ఇష్టపడతారు. కాబట్టి ఇళ్ళల్లో కెచప్ లు , సాస్లకి కూడా ఈమధ్య అధికంగా డిమాండ్ పెరిగింది . అలాగే ఫుడ్ స్టాల్స్ , హోటళ్ళు, క్యాంటీన్ లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు .. కాబట్టి మీరు వీటిని తయారు చేసి కూడా మంచి లాభం పొందవచ్చు. వీటికి పైగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్ద ఉంటూనే డబ్బు సంపాదించవచ్చు. మీరు తప్పనిసరిగా ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని చేసేటప్పుడు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా లైసెన్స్ పొందాలి.
అప్లై చేసిన 15 రోజుల్లో పై పొందుతారు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.కాబట్టి దాబాలు, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో వీటిని మీరు విక్రయించవచ్చు . ఒకవేళ మీరు నేరుగా విక్రయించిన లేదా హోల్సేల్ మార్కెట్లతో మాట్లాడుకున్నా.. సరే మీకు లాభం వస్తుంది.. ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా మీరు చెప్పి మీ ఉత్పత్తిని విక్రయించమని అడగవచ్చు మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా లోన్ సహకరిస్తోంది.. అతి తక్కువ వడ్డీతో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద పది లక్షల వరకు మీరు రుణం పొందవచ్చు ఐదు సంవత్సరాల లోపు వీటిని చెల్లిస్తే సరిపోతుంది.