అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే అధిక పెన్షన్ పొందడానికి ఈపీఎస్ సభ్యుడు తమ సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు తో పాటు అడిగిన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.. కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారమే దరఖాస్తు సమర్పించబడుతుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ ఫండ్కు సర్దుబాటు అవసరమైతే ఉద్యోగ యొక్క పరస్పర సమ్మతి కూడా అవసరం.
ఒకవేళ మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నుంచి పెన్షన్ పండుకు నిధులను బదిలీ చేసిన సందర్భంలో ట్రస్ట్ ఒక అండర్ టేకింగ్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించిన వెంటనే యుఆర్ఎల్ లింకును కూడా పొందుతారు. ప్రస్తుత కాలంలో అది పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ కూడా తమ కస్టమర్లకు అత్యధిక పెన్షన్ ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు జారీ చేసింది ఉద్యోగుల పెన్షన్ స్కీములు సవరిస్తూ ఏకంగా 7500 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
వాస్తవానికి ఆగస్టు 31 2014 వరకు సభ్యులుగా ఉన్న ఉద్యోగులు ఈ పథకం కింద అధిక పెన్షన్ ఎంచుకొని ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కూడా అత్యధిక పెన్షన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.