సాధారణంగా భారతీయ మహిళలను చీరలు ఎక్కువగా ఆకర్షిస్తాయనటంలో సందేహం లేదు. అందమైన చీరలను కొనడానికి మహిళలు ఎప్పుడు కూడా అందంగానే ఉంటారు. అంతేకాదు మహిళలు చీరలు కొనాలనుకున్నప్పుడు వారికి ఆర్థిక స్తోమత కూడా అడ్డురాదు అనడంలో సందేహం లేదు. అందుకే ఎప్పుడు డిమాండ్ ఉండే ఈ చీరల వ్యాపారాన్ని మీరు ప్రారంభించినట్లయితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వస్తుంది. పైగా మీరు మొదట్లో కేవలం 10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టినా సరే అంతకుమించి లాభం పొందవచ్చు.
రద్దీగా ఉండే ప్రదేశంలో ఇళ్లు లేదా షాపు ఉన్నట్లయితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. కేవలం చీరలు మాత్రమే కాదు ఆడవాళ్ళకు అవసరమయ్యే మిగతా అన్ని జువెలరీ ఐటమ్స్ తో పాటు హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇలా ఆడవారికి అవసరమయ్యే అన్నింటినీ కూడా మీరు మీ షాప్ లో విక్రయించవచ్చు . అప్పుడు రెండు రకాలుగా మీకు లాభం వస్తుంది.. ఇక చీరలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే.. మార్కెట్లో లేటెస్ట్ మోడల్స్, ట్రెండీగా ఫ్యాషన్ గా ఉండే చీరలని మీరు సెలెక్ట్ చేసుకోవాలి . అప్పుడే మహిళలు ఆకర్షించబడతారు.. ముఖ్యంగా ఫెస్టివల్స్ సమయంలో మీరు కష్టమర్ల అవసరాలను క్యాష్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే చీరలతోపాటు బ్లౌజ్, సారీ పెట్టికోట్ బ్లౌజ్ పీసులు పాల్స్ లు కూడా విక్రయించవచ్చు.