ముఖ్యంగా మీరు చిన్న పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో కోటీశ్వరులు కూడా అవ్వచ్చు. అలాంటి పథకాలలో బెస్ట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టం. కేంద్ర ప్రభుత్వం దీనిని 2004 జనవరి 1న ప్రారంభించింది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అని చెప్పిన ఆ తర్వాత మాత్రం ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకునే వెసలు బాటును కల్పించడం జరిగింది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు కూడా పొందుతారు. పదవి విరమణ పొందేసరికి పెద్ద మొత్తంలో మీరు స్థిర ఆదాయాన్ని పొందవచ్చు.
ఈ పథకంలో 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు ఎవరైనా సరే కావటం తెరవచ్చు. కనీసం రూ.500 పెట్టుబడితో ఖాతాను ప్రారంభించవచ్చు.. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పదవీ విరమణ తర్వాత జీవితానికి భద్రత ఇవ్వడమే. మీకు 30 సంవత్సరాలు అయితే 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తారు. మీరు ఇప్పటినుంచే ప్రతి నెల రూ. 5000 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీరు పదవి విరమణ చేసేసరికి కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు పొందవచ్చు. పెట్టిన పెట్టబడిపై కనీస రాబడి 10% అంచనా వేసిన నికర పెన్షన్ సంపద రూ.1.11 కోట్లు లభిస్తుంది. అంటే మీరు 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి నెలకు రూ.27,996 పెన్షన్ రూపంలో పొందవచ్చు.