క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. 1996 అక్టోబర్ 29న ఈ పథకం ప్రారంభమైంది ఇందులో 11.47 రాబడిని అందిస్తోంది. కాబట్టి మీరు ఊహించని రేంజ్ లో ఆదాయం పొందవచ్చు. గత మూడు సంవత్సరాల లో మనం పరిశీలించినట్లయితే ఈ స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరానికి 47.25% మేర రాబడిని అందించింది ముఖ్యంగా రెగ్యులర్ ప్లాన్లకు ఇది బాగా వర్తిస్తుంది. అదే డైరెక్ట్ ప్లాన్ అయితే 49.2 3% రాబడిని పొందవచ్చు ముఖ్యంగా ఇది చాలా కాలం ఎక్కువ రాబడిని అందిస్తుంది.
ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూసుకున్నట్లయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఆరంభం నుంచే నెలకు రూ.1500 చొప్పున సిప్ చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఆ మొత్తం సుమారుగా రూ.30 లక్షలకు చేరి ఉండేది.. ఒకవేళ గత మూడు నెలల్లో మనం పరిశీలించినట్లయితే రూ.1500 సిప్ మొత్తం ఏకంగా రూ.1.2 లక్షలకు చేరి ఉండేది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది క్యాపిటల్ అప్లిసియేషన్ లక్ష్యంగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది.. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు అదిరే ప్రాఫిట్ అందించాలనే దీనిని తీసుకురావడం జరిగింది ఈ ప్లాన్ లో మీరు డబ్బులు పెట్టాలంటే భారీ రిస్క్ ఉంటుంది. దీనిని మీరు అంగీకరించినట్లయితే ఇందులో డబ్బులు పెట్టవచ్చు . ఊహించని రేంజ్ లో డబ్బులు మాత్రం లభిస్తాయి