ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే వెల్లుల్లి వ్యాపారం.. భారతీయ వంటకాలలో వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తీపి పదార్థాలలో మాత్రమే వెల్లుల్లి ఉపయోగించరు.. కానీ మిగతా అన్నింటిలో కూడా దాదాపు వెల్లుల్లి వేయని ఆ వంట పూర్తి అవ్వదు. కూరగాయల నుంచి మాంసాహారం వరకు ప్రతి వంటకంలో కూడా వెల్లుల్లి తప్పనిసరిగా జోడించాల్సిందే.. ఈ వెల్లుల్లి వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి బాగా కాపాడుతుంది.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నిరోధించి అధిక ఫ్యాట్ నుంచి కాపాడుతుంది. అందుకే వెల్లుల్లి తప్పనిసరిగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి వెల్లుల్లిని మీరు వ్యాపారంగా మార్చుకుంటే ఆదాయం బాగా వస్తుంది.హోల్‌సేల్ వ్యాపారం చేయడం వల్ల కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ వెల్లుల్లి వ్యాపారాన్ని హోల్‌సేల్‌గా మండీల లో కొనుగోలు చేసి రిటైల్ గా కిరాణా షాపులకు విక్రయించవచ్చు. ప్రస్తుతం ఒక కేజీ వెల్లుల్లి ధర 100 రూపాయల పైగానే పలుకుతోంది.. మీరు మార్కెట్లో కేవలం 30 రూపాయలతో కొనుగోలు చేసి వంద రూపాయలకు అమ్మినా.. మీకు ప్రతి కేజీ పైన 70 రూపాయలు మిగులుతుంది. ఆ లెక్కన చూసుకుంటే 100 కేజీల వెల్లుల్లిపై మీకు సుమారుగా 7000 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే మీరు ప్రతి నెల రూ. 50 వేలకు పైగానే లాభం పొందవచ్చు. మీకు హోల్‌సేల్ గా వెల్లుల్లి కావాలి అంటే రాజస్థాన్, హర్యానా , ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇక్కడ అమ్మవచ్చు.