ఇకపోతే పిల్లల భవిష్యత్తు కోసం చేసే పొదుపు తక్కువ విధిలో ఉండదని అందుకే పిల్లల కోసం 5 లేదా 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు ఈ సందర్భంలో ఈక్విటీ పెట్టుబడి అనేది చాలా ఉత్తమమైన ఎంపిక. అదే సమయంలో ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం దీర్ఘ కాలిక రాబడును కోసం ఈక్విటీ పెట్టుబడి చాలా ఉత్తమమైనది. ఇకపోతే పిల్లల కోసం డబ్బును దాచాలనుకునే వారికి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఫిబ్రవరి 2001లో రెండు ఫండ్స్ ప్రారంభించింది మొదటిది హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ సేవింగ్ ప్లాన్.. అయితే ఇది 2017 అక్టోబర్ 18న నిలిచి వేయబడింది ఇక రెండవది హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ గ్రోత్ ప్లాన్ ఇందులో ఆరు నెలల్లో 14.15% 2 సంవత్సరాలలో 21.36 శాతం రాబడిని అందించింది ఇది పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ఇక ఒక హెచ్డిఎఫ్సి లోనే కాదు ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ అలాగే ఎస్బిఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడానికి చాలా చక్కగా పనిచేస్తాయి.