ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ ఈ పథకం కింద ఎల్పిజి సిలిండర్ ల పై ఇచ్చే రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారుగా 9.6 కోట్ల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి సిలిండర్ కు రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.
9.6 కోట్ల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందించడానికి 14.2 కిలోల సిలిండర్ పై రెండు వందల సబ్సిడీని ఏడాదికి 12 రీఫిల్స్కు ఆర్థిక వ్యవహారాల సబ్ కమిటీ ఆమోదించిందని ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మార్చి ఒకటి 2023 నాటికి 9.59 కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. ఈ పథకానికి 2022 2023 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం వ్యయం రూ.6,100 కోట్లు కాగా ఇప్పుడు 2023 - 24 కి గానూ రూ.7,680 కోట్ల ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మొత్తానికైతే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై గ్యాస్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.