మోడీ సర్కార్ రైతులకు ప్రయోజనాలు కలిగించే విధంగా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఆ పథకాలతో రైతులకు వేల రూపాయల ఆదాయాన్ని కలిగేలా చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ పథకం కూడా ఒకటి.ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల ఖాతాలో రూ. 6000 జమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం రెట్టింపు చేయబోతుందని సమాచారం.

ప్రస్తుతం 6000 రూపాయల ఇస్తున్న మొత్తాన్ని 12 వేల రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా కేంద్రం ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే రైతులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడులు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులకు మేలు చేసే దిశగా కేంద్రం కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇకపోతే కోట్ల సంఖ్యలో రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం రూ.6000 రూపాయలను ఉచితంగా పొందుతున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆ మొత్తాన్ని కాస్త రూ. 12,000గా చేయబడింది.


మరొకవైపు ఎరువులపై సబ్సిడీ పెంచాలని రైతుల నుంచి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా నిర్ణయం తీసుకొని అవకాశం కనిపిస్తోంది.  ఇకపోతే ఇప్పటివరకు ఈ స్కీం నగదు 13 విడతల్లో రైతుల ఖాతాలో జమ అయ్యింది. అంటే మొత్తం 26 వేల రూపాయలను రైతులు ఉచితంగా పొందారు త్వరలో కేంద్ర ప్రభుత్వం 14 వ విడత నగదును కూడా రైతుల ఖాతాలో జమ చేయడం ఉందని సమాచారం. ఇకపోతే ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ మంది రైతులకు ఈ పథకం వల్ల బెనిఫిట్ కలుగుతోంది కొంతమంది రైతులు వివరాల నమోదు చేసుకోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అంతకంతకు తగ్గుతుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: