ఉచితంగా ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తే బాగుండు అని ఆలోచించే వారి సంఖ్య.. అప్పుడప్పుడు ఎక్కువ అవుతూనే ఉంటుంది. అయితే మీరు కూడా డబ్బు ఉచితంగా పొందాలని అనుకుంటున్నట్లయితే మీకు ఒక శుభవార్త అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేకుండానే ఉచితంగా డబ్బులు పొందవచ్చు. అయితే ఎలా అని అనుకుంటున్నారా? మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మోడీ సర్కార్ అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులోకి తీసుకురాగా దీని ద్వారా మీరు ఉచితంగానే డబ్బులు పొందవచ్చు..

ఇందుకోసం ఒక ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది మోడీ ప్రభుత్వం.  ఇందులో పాల్గొని మీరు విజేతగా నిలిస్తే ఉచితంగానే డబ్బులు వస్తాయి. ఆ కాంటెస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే మంచి పోస్టర్ డిజైన్ చేయడమే. ఏకంగా 25 వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం గవర్నమెంట్మార్కెట్ ప్లేస్ జి ఈ ఎం తీసుకు రావడం జరిగింది ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్.. దీని ద్వారా సెల్లర్లు వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించడానికి వీలుగా ఉంటుంది 2016లో ఈ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చింది కానీ ఎవరికి పెద్దగా అవగాహన లేదు అయితే ఇప్పుడు తాజాగా మై గౌవ్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న నేపథ్యంలో పోస్టర్ డిజైన్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది..


"త్రీ పిల్లర్స్ ఆఫ్ జెం: ఎఫిషియంట్, ట్రాన్స్పరెంట్, ఇంక్లూజివ్" పై పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొనేవారు కొన్ని విషయాలను కూడా గుర్తించుకోవాలి. మీరు తయారు చేసే పోస్టర్ జెపిఈజి ఫార్మాట్ లో ఉండి,  ఏ త్రీ సైజు సీటులో పోస్టర్ డిజైన్ చేసి ఉండాలి దీనికి అనుగుణంగా పోస్టర్ డిజైనింగ్ ఉండాలి. అప్పుడే మీ పోస్టర్ కి ఎంట్రీ అనేది లభిస్తుంది ఇందులో విజేతగా నిలిచిన వారికి 25000 సెకండ్ ప్లేస్ గా నిలిచిన వారికి 20,000 మూడవ ప్లేసులో ఉన్నవారికి 15000 రూపాయలను అందజేస్తారు. ఈ కాంటెస్ట్ 2023 మే 2 వరకు ఉంటుంది. మై గౌవ్ వెబ్సైట్ లోకి  అప్లికేషన్ సమర్పించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: