దేశ ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను సైతం తీసుకురావడం జరుగుతోంది.. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాలు స్కీములను కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది .రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలలో పీఎం కిసాన్ పథకం కూడా ఒకటి.. దీని ద్వారా రైతుల ప్రతి ఏట రూ.6000 రూపాయలను పొందుతూ ఉన్నారు.. మొత్తం మూడు విడతలలో రూ.2000 చొప్పున వేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా 9 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.


నాలుగు నెలలకు ఒకసారి రూ 2000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలలో జమ చేస్తోంది ..అయితే ఇప్పటివరకు 13వ విడత డబ్బులు అందగా తాజాగా 14వ విడత త్వరలోనే రాబోతున్నది.ఈ నేపథ్యంలోనే pm కిసాన్ పథకం పై ఒక ప్రచారం జరుగుతోంది అలాంటి ప్రచారానికి కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. అదేమిటంటే పిఎం కిసాన్ పథకం కింద ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండడంపై ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

రైతు కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని భార్యాభర్తలు ఇద్దరికీ వర్తించదని తేల్చి చెప్పారు అయితే భార్య భర్తలు ఇద్దరికీ భూమి ఉన్నట్లు వేర్వేరు పాసుబుక్కులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హులని కేంద్రం స్పష్టత ఇచ్చింది.. అంతేకాకుండా పాసుబుక్కులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే ఈ సహాయం అందుతుందని తెలిపింది.. ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలి అంటే రైతులు భూ రికార్డులను సరి చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేయడం తప్పనిసరి ఆ తర్వాత రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి తమ పేరును నమోదు చేసుకుని ఆధార్, బ్యాంకు, పాన్ కార్డు నెంబర్లను నమోదు చేయాలని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: