ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ లో ఎల్ఐసి లు సరికొత్త పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అయితే ఇందులో పెట్టుబడి రిస్క్ లేకుండా రాబడి పొందవచ్చు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సేవింగ్స్ పథకాలలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఎటువంటి రిస్క్ లేకుండా ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు.

ఇక పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం కూడా ఒకటి.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ పథకం పై వడ్డీ రేటును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకం పై 7.7% వడ్డీ కూడా లభిస్తుంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎటువంటి రిస్కు ఉండదు.  పైగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. కాబట్టి ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు ఈ పథకంలో చేరడం వల్ల మంచి లాభాలు వస్తాయి.  అంతేకాదు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కూడా పొందుతారు.అంతేకాకుండా మీకు పం మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు.. .

ఉదాహరణకు ఈ పథకంలో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే ఈ పథకంపై 7.7% వడ్డీ కూడా లభిస్తుంది. కాబట్టి ఆ లెక్కన ఐదు సంవత్సరాలుగా రూ. 4.5 లక్షల దాకా మీ చేతికి వస్తాయి.  అంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.14.5 లక్షలు లభిస్తాయి ఇకపోతే మీరు ఈ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు లేదా అకౌంట్లో అలా పెట్టుకున్న సరే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలపై ఇప్పుడు ఉన్న వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత కూడా మరో రెండు సంవత్సరాలు మీరు అకౌంట్లో డబ్బులు ఇలాగే ఉంచితే వడ్డీ పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: