కాబట్టి మీరు కూడా టీ ఉత్పత్తికి బదులుగా టీ బ్యాగు తయారు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ టీ బ్యాగు ఒక చిన్న సన్నని చిల్లులు కలిగిన బ్యాగు లాగా ఉంటుంది.. లోపల టీ ఆకు ఉంటుంది ఈ బ్యాగు ని ఒక కప్పు వేడి నీటిలో ముంచినప్పుడు టీ తయారవుతుంది. ఈ టీ బ్యాగును ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు.. ఈ టీ బ్యాగ్ ఒక ఆహార పదార్థం కాబట్టి ఆహారానికి సంబంధించిన వివిధ రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు వ్యాపారానికి ముందు చేయించుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ వ్యాపారాన్ని ఎలా ఏ విధంగా మొదలుపెట్టి లాభాలు పొందవచ్చు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
మనదేశంలో టీ బ్యాగు వ్యాపారాన్ని మొదలుపెట్టాలంటే కొన్ని యంత్రాలు అవసరం అవుతాయి. ఇక ఈ టీ బ్యాగ్ తయారీ యంత్రం సుమారుగా ధర రూ.1,75,000 వరకు ఉంటుంది అలాగే ముడి సరుకుల విలువ దాదాపుగా రూ.25,000. ప్యాకేజింగ్ ధర రూ.25,000.. ఇతర ఖర్చులు రూ.25,000.. ఇలా మొత్తంగా మీరు రూ.2,50,000 పెట్టుబడి పెట్టాలి.. కేంద్రం అందించే ముద్ర లోన్ పథకం కింద లోన్ తీసుకొని వ్యాపారం మొదలుపెట్టి ఈ టీ బ్యాగులను విక్రయించే కంపెనీలతో ఒప్పందం తీసుకొని మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇది మీ ఆదాయాన్ని ఊహించని విధంగా పెంచుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.