అంతేకాదు ఎవరైనా స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా రుణలభ్యత పెంచనున్నాము అని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే లోన్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది కాబట్టి డేటా లభ్యత మెరుగుపడిందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల బ్యాంకు కూడా రుణ మంజూరును మరింత మందికి విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది అని స్పష్టం చేయడం గమనార్హం ఆయన మాట్లాడుతూ మేము గత ఆరు సంవత్సరాలుగా 10 సెకన్లలోనే లోన్ సర్వీస్ లను అందిస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నాము అందుకు ఇప్పుడు మరింత మార్కెట్ విస్తరణ పై ఫోకస్ పెడుతున్నాము అని వివరించారు.
ఇక ఈ 2023 ఏడాది చివరి నాటికల్లా హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఖాతా లేని వారికి కూడా కేవలం 10 సెకన్లలోనే పర్సనల్ లోన్ సర్వీస్ లను అందించడమే లక్ష్యంగా నిర్దేశించాము అని.. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఒకటి పాయింట్ రెండు కోట్ల మేర ప్రీ అప్రూవ్డ్ లోన్ కస్టమర్లు ఉన్నారు అని తెలిపారు. ఇకపోతే దేశవ్యాప్తంగా 650 జిల్లాలలో బ్యాంకు వ్యక్తిగత రుణాలు అందించేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మేనేజ్మెంట్ ప్రకారం చూసినట్లయితే స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణ లభ్యత కేవలం ఐదు శాతం మాత్రమే ఉంది అందుకే బ్యాంకు వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి వారి వాటాను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందట హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరింత ఆసరాగా నిలవనుంది.