
ప్రస్తుతం ఎండలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చల్లటి పదార్థాలను సేవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ వేసవి కోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలు కూడా పుట్టుకొస్తూ ఆదాయాన్ని కూడా పోగు చేసుకుంటున్నారు. అలాంటి వాటిలో మజ్జిగ, లస్సి, కూల్ డ్రింక్స్, జ్యూస్ వంటి వ్యాపారాలు.
అయితే ఈ వ్యాపారాలను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..
కూల్ డ్రింక్స్ బిజినెస్..
వేసవికాలంలో కూల్ డ్రింక్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అందుకే ఈ వ్యాపారం మొదలుపెడితే కచ్చితంగా నెలకు లక్ష లేదా లక్షన్నర వరకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మంచి ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.
ఐస్ క్రీమ్ బిజినెస్..
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవిలో కచ్చితంగా ఒక్కసారైనా ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు.. ఇకపోతే మండే ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐస్ క్రీమ్ బిజినెస్ కి కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందడమే కాకుండా నలుగురికి రుచికరమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ని కూడా అందించవచ్చు. ఇక ఈ బిజినెస్ మీకు ప్రతి నెల రూ. 80 వేలకు పైగా ఆదాయాన్ని అందిస్తుంది.
జ్యూస్ బిజినెస్:
వేసవికాలంలో రోడ్డు సైడ్ కూడా మీరు ఈ జ్యూస్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి జ్యూస్ తీసి అమ్మినా సరే మీకు మంచి ఆదాయం వస్తుంది. దీనివల్ల మీకు రోజుకు రూ.800 కు పైగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది.