ఈ క్రమంలోని భారత ప్రభుత్వం అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంపై వడ్డీ రేటు పెంచవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పథకంలో చేరిన వారికి మంచి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. గతంలో ఈ పథకం యొక్క వడ్డీ రేటు 7.9% ఉండేది కానీ కాలక్రమేన 7.1 శాతానికి తగ్గింది. ఇక అప్పటినుంచి మళ్ళీ వడ్డీ రేటు అలాగే ఉంటూ వస్తుంది. ఈసారి సేవింగ్ స్కీం పై వడ్డీ రేట్లు పెరిగినా కూడా పీపీఎఫ్ వడ్డీ రేటు మాత్రం స్థిరంగానే ఉంటూ వచ్చింది. కానీ ఈసారి వడ్డీ రేట్లు పెంపు ఉండవచ్చు అని ప్రభుత్వం దాదాపు మూడేళ్ల తర్వాత ఈ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మీరు కూడా ఇందులో చేరాలి అనుకుంటే పీపీఎఫ్ పథకంలో రోజుకు వంద రూపాయలు చొప్పున నెలకు 3000 రూపాయల చొప్పున ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 10 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాలు. మీరు కావాలనుకుంటే ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించుకొని ఎక్కువ డబ్బు పొందవచ్చు.