కేంద్ర ప్రభుత్వం తాజాగా పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఎన్నో రకాల ఫైనాన్షియల్ సర్వీస్లను ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చడానికి మరిన్ని అడుగులు ముందుకు వేస్తోంది. అలా వివిధ సేవింగ్స్ స్కీమ్స్ సైతం ఇండియా పోస్టు ఇప్పుడు ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం.ఈ క్రమంలోనే సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీని వారికోసం అందించడం జరిగింది.

ఇకపోతే వివిధ సేవింగ్స్ స్కీమ్స్ సైతం ఇండియా పోస్ట్ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో సొంత వ్యాపారం పెట్టుకోవాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ స్కీం ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్ కేవలం రూ.5000 ప్రారంభ పెట్టుబడితో తమ వెంచర్లను కూడా స్థాపించవచ్చు. బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.. ఇక సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆసక్తి ఉన్నవారి కోసం భారతదేశంలోని ప్రజలకు ఇండియన్ పోస్ట్  సేవలను అందిస్తుంది. అందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ తోడ్పాటు అందిస్తూ మరింత ముందడుగు వేసింది. ఇకపోతే ఈ ప్రభుత్వ సంస్థలు మెంబెర్ గా ఉండడం వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది.

ఇక ఇందులో వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలైన ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతులు ఓ బి సి అభ్యర్థులకు కూడా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ముఖ్యంగా కనీసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణత అనేది చాలా అవసరం. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత ఫ్రాంచైజీలు తమ స్టోర్లో అందించిన పోస్టల్ సేవలు, వస్తువుల విక్రయాల ఆధారంగా కమిషన్ ను సంపాదించవచ్చు. అలాగే కష్టమర్ల సంఖ్యను బట్టి కూడా రూ.20వేల నుంచి 80వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. ఎక్కువ కృషి , అంకితభావం ఉన్నవారికి ఇవి బాగా లాభాన్ని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: