అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం .. దీనిని మనం పిపిఎఫ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇకపోతే ఈ పథకంలో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు పన్ను మినహాయింపుతో పాటు భారీ రాబడి కూడా పొందే వీలుంటుంది. పైగా రిస్క్ తక్కువ ఇందులో మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ పీపీఎఫ్ పథకంపై 7.1% వడ్డీ రేటు లభిస్తున్న నేపథ్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీరేట్లను మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉండడం వల్ల ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవచ్చు లేదా మారవచ్చు. ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాల మీరు ఈ పథకంలో రూ .55 లక్షల పొందాలి అనుకుంటే నెలకు రూ.3000 చొప్పున రోజుకు వంద రూపాయలు చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.55 లక్షల పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు 35 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తే 60 సంవత్సరాల వయసుకల్ల మీ చేతికి రూ.55 లక్షలు లభిస్తాయి.