త్వరలోనే డి ఎ పెంపుతో హెచ్ ఆర్ ఏ పెరుగనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను వెల్లడించింది. మార్చిలోనే డి ఏ ను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది అంటూ వార్తలు జోరుగా వైరల్ అయిన విషయం తెలిసిందే. చివరిసారిగా 2021 జూలైలో హెచ్ఆర్ఏ పెరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు డిఏ తొలిసారి 25% నుంచి 28 శాతానికి పెరగగా ఇప్పుడు కూడా డిఏను సవరించడంతో కొత్త స్థాయికి అది చేరుకుంది అందుకే మళ్ళీ హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్)ని కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హెచ్ఆర్ఏ త్వరలోనే పెరుగనున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనిచేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఈ హెచ్ ఆర్ ఏ నిర్ణయిస్తామని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎక్స్, వై, జెడ్ అనే కేటగిరీలుగా ప్రదేశాలను విభజించి.. ఎక్స్ కేటగిరీలో పనిచేసే ఉద్యోగస్తులకు హెచ్ఆర్ఏ 27% పెంచగా.. వై గ్రూపు ఉద్యోగస్తులకు 18 శాతం నుంచి 20% అలాగే జెడ్ గ్రూప్ ఉద్యోగస్తులకు 10% వరకు హెచ్ఆర్ఏ ఉంటుందనీ సమాచారం.

మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మూడు శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఎక్స్ గ్రూప్ ఉద్యోగస్తులకు మూడు శాతం,  వై గ్రూపు ఉద్యోగస్తులకు రెండు శాతం, జెడ్ గ్రూప్ ఉద్యోగస్తులకు ఒక శాతం హెచ్ఆర్ఏ పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  మొత్తంగా ఈ పెరుగుదలతో ఉద్యోగస్తులు హెచ్ఆర్ఏ 27% నుంచి 30% తీసుకోనున్నారు. ఇక డిఏ పెంపు ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములారుకు అనుగుణంగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.  ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు డిఎను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు హర్యానా, తమిళనాడు, ఒడిస్సా వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలోకి చేరిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: